షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో అటు నార్త్ తోపాటు సౌత్ లోనూ కలెక్షన్స్ లో జోరు కొనసాగించనుంది.ఇక ఈసినిమా తాజాగా మరో రికార్డు ను క్రీయేట్ చేసింది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 690 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో గద్దర్ 2 రికార్డు ను బ్రేక్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన రెండో హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.పఠాన్ మొదటి స్థానంలో వుంది.ఫుల్ రన్ లో ఈసినిమాను కూడా వెనక్కి నెట్టి జవాన్ మొదటి స్థానం లోకి వచ్చిన రావొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గదర్ 2 ఇప్పటివరకు 600కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా జవాన్ వచ్చే వరకు సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది అయితే జవాన్ విడుదల తరువాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జవాన్ ఈరోజుతో 700కోట్ల క్లబ్ లో చేరనుంది. బాలీవుడ్ లో ఇది మూడో సినిమా కానుంది. ఇంతకుముందు దంగల్,పఠాన్ మాత్రమే ఈఫీట్ సాధించగా తాజాగా జవాన్ ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది.మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది చెప్పాలి.
ఏడాది ప్రారంభంలో పఠాన్ బాక్సాఫీస్ ను షేక్ చేయగా గత నెలలో గదర్ 2 ఇప్పుడు జవాన్ వసూళ్ల సునామీని సృష్టించాయి.మరి నవంబర్ లో విడుదలకానున్న సల్మాన్ ఖాన్, టైగర్ 3 కూడా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























