పెదకాపు1 ‘అఖండ’ లాంటి విజయం సాధించాలి

v v vinayak interesting comments on peddha kapu 1 movie

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వస్తున్న సినిమా పెదకాపు1. ఈసినిమా సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలోభాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల నా మనసుకి చాలా దగ్గరరైన వాడు. తన రైటింగ్ సెన్సిబిలిటీస్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో రావు రమేష్ గారి పాత్ర గురించి ఛోటా చెప్పినప్పుడు అసలు ఇలాంటి పాత్రలని ఎలా రాయగలుగుతున్నాడనిపించింది. ట్రైలర్ చాలా బావుంది. సినిమా అద్భుతంగా వుంటుంది. రవీందర్ రెడ్డి గారు సినిమాపై ఇష్టం వున్న నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఇలాంటి బావ ఒకరు ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే బామ్మర్దిని హీరో చేశారు( నవ్వుతూ). ఒక కొత్త హీరో సినిమాకి ఇన్ని కోట్లు ఖర్చు చేయడం మామూలు విషయం కాదు. నా దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాకి బెల్లం కొండ సురేష్ గారు అలా ఖర్చు చేశారు. దీని తర్వాత అంత తెగింపుతో ఎలాంటి లెక్కలు లేకుండా తీసిన సినిమా పెదకాపు1. ఇది కూడా అఖండ అంత హిట్ కావాలని, విరాట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మణిరత్నం గారి దొంగదొంగ సినిమాలో పీసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ నా మనసులో ముద్రించుకుపోయింది. పెదకాపు ట్రైలర్ చూస్తునపుడు అది మళ్ళీ రిపీట్ అయినట్లు అనిపించింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఛోట అన్న.. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి శ్రీకాంత్, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి. రవీందర్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.