జవాన్‌ కు సూపర్ హిట్ టాక్.. అనిరుధ్ ఎమోషనల్ ట్వీట్

Anirudh Emotional Post on Blockbuster Talk For Jawan Movie

కింగ్ ఖాన్ షారుఖ్‌ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘జవాన్‌’. ఈ యేడాది షారుఖ్‌ ఖాన్ నుంచి ‘పఠాన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న మూవీ కారావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ అంచనాల నేపథ్యంలోనే జవాన్‌ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన షారుఖ్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ సోషల్‌ మీడియాలో పాజిటీవ్‌ రెస్పాన్స్ ఇస్తున్నారు. పఠాన్ బాటలోనే కింగ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల మూవీ చేశాడంటూ కితాబిస్తున్నారు. దేశవ్యాప్తంగా జవాన్‌ సినిమాకు ఇదే రీతిలో బ్లాక్‌ బస్టర్ టాక్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో డైరెక్టర్ అట్లీ తో పాటు సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. అట్లీ డైరెక్షన్ ఒకెత్తయితే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కాగా గత నెలలోనే అనిరుధ్ మ్యూజిక్ అందించిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం రూ.650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమా జవాన్‌ కి కూడా అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనిరుధ్ స్పందించాడు.

ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా అనిరుధ్ ఓ ఎమోష‌న‌ల్ ట్విట్ పెట్టాడు. సినిమా విజ‌యం సాధించడం ప‌ట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన తన సినీ ప్రయాణం ‘ఆళ్వార్‌పేట్ నుంచి మొదలై అంధేరి’ వరకు చేరిందని తెలిపాడు. అలాగే హీరో షారుఖ్ ఖాన్ కి కృతఙ్ఞతలు అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. కాగా అనిరుధ్ పెట్టిన ఈ పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ అగ్రహీరో సంజయ్ దత్ క్యామియో రోల్ లో మెరిశారు. జవాన్ మూవీని షారుఖ్ సతీమణి రెడీ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మించింది.

ఇదిలా ఉండగా అనిరుధ్ టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హై యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది పాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.