గామి డబ్బింగ్ తో బిజీగా విశ్వక్

vishwak sen starts his dubbing for gaami movie

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఈసారి మాత్రం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా గామి సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. వాటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు విశ్వక్ గామి సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాలవల్ల ఇప్పటి ఆలస్యమైంది. దీంతో చిత్రయూనిట్ వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలా రోజుల తరువాత ఒక అప్ డేట్ ఇచ్చాడు విశ్వక్. ఈసినిమాకు డబ్బింగ్ షురూ చేశాడు. ఈమేరకు తను డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా షేర్ చేస్తూ త్వరలోనే సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఉండనున్నట్టు హింట్ కూడా ఇచ్చాడు.

కాగా విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న.. ఈసినిమాలో విశ్వక్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో అఘోరా పాత్ర కూడా ఒకటి ఉండబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇంకా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.