కేరళ రాష్ట్రం యొక్క అతిపెద్ద పండుగ ‘ఓనమ్’. తెలుగువారికి ‘పొంగల్’ ఎంత పెద్ద పండుగో.. మలయాళీలకు ఈ ఓనమ్ అలాగ. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనమ్. ఈ పది రోజుల పండుగ 2023లో ఆగష్టు 20న ఆదివారం మొదలై.. గురువారం (ఆగష్టు 31)తో ముగియనుంది. ఇక ఓనమ్ పండుగ సందర్భంగా.. కేరళలో ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ పండుగను కేరళ రాష్ట్రంలోనే కాకుండా.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలు కుడా ఘనంగా జరుపుకోవడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
എല്ലാ മലയാളികൾക്കും എൻ്റെ ഹൃദയം നിറഞ്ഞ തിരുവോണാശംസകൾ 🌼#HappyOnam pic.twitter.com/GrY047B0Ir
— Mohanlal (@Mohanlal) August 29, 2023
ఇక ఓనమ్ సందర్భంగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అందులో పండుగను పురస్కరించుకుని సాంప్రదాయ దుస్తులలో కుర్తాతో కనిపించిన మోహన్ లాల్.. పూక్కలం (పువ్వుల రంగోలి) ముందు పోజులిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు మరియు రాష్ట్ర ప్రజలకు ‘హ్యాపీ ఓనమ్’ శుభాకాంక్షలు అని తెలిపాడు. ఓనమ్ పండగ తెచ్చే సంబరాలతో మలయాళీలందరి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా మోహన్ లాల్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: