గోపీచంద్ 22 ఏళ్ల సినీ జర్నీ

gopichand completed 22 successful years in TFI

తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో గోపీచంద్. మొదటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అయితే ఒకసారి హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలు చేయాలంటే కాస్త వెనుకాడతారు. కానీ గోపీచంద్ మాత్రం ఏమాత్రం సంశయించకుండా విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఒకరకంగా అప్పుడు ఆవిలన్ రోల్స్ వల్లే ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఈస్థాయిలో ఉన్నాడని చెప్పొచ్చు. జయం సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ పాత్రలు చేసి మెప్పించాడు. ఇక 2004లో వచ్చిన యజ్ఞం సినిమా గోపీచంద్ కెరీర్ ను ఓ మలుపు తిప్పేసింది. గోపీచంద్ హీరోగా నటించగా ఆసినిమా హిట్ అయింది. ఇక ఆతరువాత గోపీచంద్ వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ సినిమా తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు గోపీచంద్. తన కేరీర్ లో రణం, లక్ష్యం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు, గోలీమార్ లాంటి హిట్లను సొంతం చేసుకున్నాడు. తన సినిమాలతో యాక్షన్ హీరోగా, మ్యాచో స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. అందుకే ప్రస్తుతం గోపీచంద్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక హిట్ పడితేకానీ మళ్లీ కెరీర్ ఫామ్ లోకి రాడు. కాగా సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నారు గోపీచంద్. వీరికి ఇద్దరు కొడుకులు. విరాట్ కృష్ణ, వియాన్.

ఇక గోపీచంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నభీమా అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా గోపీచంద్ మంచి హిట్ ను తన ఖాాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.