ప్రస్తుతం సీని ప్రేక్షకులు అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్. ఈసినిమా జులై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ప్రేమ నాకు సినిమానే ఇచ్చింది. ఒక్కోసారి ఇది కలా నిజమా అని కూడా అనిపిస్తుంది..ఇది నేను కోరుకున్న జీవిత కాదు.. భగవంతుడు ఇచ్చిన జీవితం.. నటుడిగా అవ్వాలని కానీ.. పాలిటిక్స్ లో కూడా ఉంటానని నేను అనుకోలేదు. కానీ ఇంత అశేషమైన ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఎంతసేవు సమాజం నుండి తీసుకోవడం కాదు.. సమాజానికి ఏదైనా ఇవ్వాలి.. ఇక ఈసినిమా అలాంటి సినిమానే. నేను ఎన్ని సినిమాలు చేసినా సమాజాన్ని ఆలోచింపచేసేదిగా ఉండాలని అనుకుంటాను.. ఈ సినిమా ఒక సంపూర్ణమైన సినిమా.
ఈసినిమా కనీసం నేను 50 నుండి 70 రోజుల్లే చేయాల్సిన సినిమా. ఒకసారి పొలిటికల్ మైండ్ సెట్ కు వెళ్లిన తరువాత కొంచం కష్టమవుతుంది. సినిమా అంటే ఇష్టం కానీ సమాజం అంటే బాధ్యత నాది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికీ చెందింది కాదు.. మా కుటుంబానికి చెందింది కూడా కాదు.. అందరికీ చెందింది. ఎవరైనా సరే బలంగా అనుకంటే సాధించవచ్చు.. అది రాజకీయమైనా సరే ఎవరికీ చెందింది కాదు అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























