గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భోళా మేనియా, జాం జాం జజ్జనక పాటలను రిలీజ్ చేశారు. రెండుపాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా మూడో పాటకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. మిల్కీ బ్యూటీ అంటూ వచ్చే ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి పాటను రేపు అంటే జులై 21వ తేదీన సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























