బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఆరు సీజన్లు జరగగా త్వరలో సీజన్ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు షో యాజమాన్యం. ప్రోమోతోనే సీజన్ పై క్యూరియాసిటీని పెంచేశారు. నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని ఈసారి సీజన్ లో అంటూ ఆగిపోతాడు.. మళ్లీ ఈసారి కొత్తగా అని చెబుతూ.. ప్రతిసారి ఇదే అంటూ అంటూ ఆగిపోయి. ఫైనల్ గా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఈసారి కొత్తగా ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేయగా.. మూడో సీజన్ నుండి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సీజన్ 7కి హోస్ట్ మారుతున్నట్టు పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాాయి. కానీ ఆవార్తలకు రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 7 కి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























