టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జులై 20 వ తేదీన యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో చిత్రయూనిట్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక అదే ఈవెంట్ లో ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను అలానే ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇవ్వనున్నారు. దీంతో ఆరోజు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి చిత్రయూనిట్ అమెరికా చేరుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రభాస్ కూడా అక్కడ ల్యాండ్ అయ్యాడు. ఈవిషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేస్తూ తెలియచేసింది. అంతేకాదు అక్కడ కార్లతో ర్యాలీ చేస్తూ చిత్ర యూనిట్ కి ప్రభాస్ కి స్వాగతాన్ని అందించారు. అయితే విశేషం ఏంటంటే ప్రభాస్ తో పాటు రానా కూడా ఉండటం..
View this post on Instagram
అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ ఇంకా దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























