మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను ఆగష్ట్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆమధ్య చాలారోజుల పాటు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏంలేదు మేకర్స్
ఈసినిమా ప్రమోషన్స్ ను రీసెంట్ గా మొదలుపెట్టారు. వరుస అప్ డేట్స్ తో ప్రస్తుతం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా నుండి లేడి లక్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. నవీన్ పొలిశెట్టి, అనుష్కను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్ పాడాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























