ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కథలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయిన సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు శ్రీవిష్ణు సామజవరగమన సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. శ్రీవిష్ణు సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈ మధ్య శ్రీవిష్ణుకి కూడా సరైన హిట్ పడలేదు. దానికితోడు ఈసినిమాకు ప్రమోషన్స్ ను కూడా ఓ రేంజ్ లో చేసింది లేదు. ఒకరకంగా ఈసినిమాకు అదే కలిసొచ్చిందని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ఇంతటి ఆదరణను సొంతం చేసుకుంది. ఈసినిమా రిలీజ్ అయి నేటితో 10 రోజులు అవుతుంది. ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో రన్ అవుతుందంటే మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే శ్రీ విష్ణు కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ విషయాన్ని తెలియచేశాడు. మరోవైపు కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. వారం రోజుల్లో ఈసినిమా 30కోట్లు కలెక్షన్స్ ను అందించి మేకర్స్ కు లాభాలను అందించింది. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా 1మినియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఆ మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉందంటున్నారు.
All centres, Full Fun Entertainer 😎
Funtastic Filliings in All centres for All shows on DAY-10 for #Samajavagaramana ❤️🔥
A true sign of a blockbuster family entertainer❤️
🎟️ https://t.co/Y61eSHB5bB@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_… pic.twitter.com/wr3xLFEX5B
— AK Entertainments (@AKentsOfficial) July 8, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























