కన్ఫామ్ ఆగష్ట్ లో సలార్ ట్రైలర్

salaar prabhas movie trailer will release in august month

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. అది నిజమే అని రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక టీజర్ సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. 24 గంటల్లో ఈసినిమా 83 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకొని మోస్ట్ వ్యూయ్డ్ టీజర్ గా కొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుందంటూ ఎప్పటినుండో వార్తలు వస్తుండగా ఆ వార్తలకు కూడా క్లారిటీ ఇచ్చేశాడు. సెప్టెంబర్ 28వ తేదీన సలార్ పార్ట్1 సీజ్ ఫైర్ పేరుతో ఈ పార్ట్ రిలీజ్ కాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ పై స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియచేశారు. పాన్ ఇండియా సినిమా సలార్ 100 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతటి ప్రభంజనం సృష్టించడంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు. మీ క్యాలెండర్ లో ఆగష్ట్ నెలను మార్క్ చేసి పెట్టుకోండి.. అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాం. మరిన్ని అప్ డేట్స్ తో కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.