డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది తన కెరీర్ లో వస్తున్న 11వ సినిమా కావడంతో VS11 అనే వర్కింగ్ టైటిల్ తోనే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా సక్సెస్ ఫుల్ గా రెండవ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. రాజమండ్రిలోని రూరల్ ఏరియాలో న్యాచురల్ లొకేషన్స్ లో రా అండ్ రగ్డ్ సెకండ షెడ్యూల్ ను పూర్తిచేసినట్టు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Raw and Rugged 2nd Schedule of #VS11 is wrapped up 🤩💥
We shot in highly remote areas capturing the authentic natural beauty of rural areas near Rajamundry ❤️
An awe-inspiring cinematic experience is awaiting you!@VishwakSenActor @yoursanjali @iamnehashetty @thisisysr… pic.twitter.com/SHyBbL7aOz
— VishwakSen (@VishwakSenActor) July 7, 2023
కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























