పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. సినిమాల రిజల్ట్ ల సంగతి పక్కనపెడితే ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గట్లేదు. రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయగా అది మిక్స్డ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా ఈఏడాదే రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితోపాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే అప్పుడే అరుదైన రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీ పాల్గొననున్నట్లు అనౌన్స్ చేశారు. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె చిత్రబృందం పాల్గొననుంది. ఈ వేడుకలకు హాజరుకానున్న తొలి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కె రికార్డ్ అందుకుంది. ఈ ఈవెంట్ లో ప్రభాస్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, అమితాబ్, కమల్ హాసన్ కూడా పాల్గొననున్నారు. అంతేకాదు ఇదే ఈవెంట్ లో ఈసినిమా టైటిల్, ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ ఇంకా దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























