ఒక సినిమాకు మౌత్ టాక్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేసినాా సినిమాలో విషయం లేకపోతే ఆసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు అలాంటి రిజల్ట్ లు అందుకోవడం చూసుంటాం. అయితే సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా సినిమా బాగుంటే మౌత్ టాక్ తోనే ఆసినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు అలాంటిదే జరుతుంది సామజవరగమన సినిమా విషయంలో. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. హిలేరియస్ ఎంటర్ టైనర్ అంటూ టాక్ ను తెచ్చుకుంది. ఈ టాక్ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై కూడా పడింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 2.89 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అయితే సెకండ్ డేకి మొత్తం మారిపోయింది. పాజిటివ్ టాక్ వల్ల ఈసినిమా ఏకంగా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో ఈసినిమా 6.31 గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక వీకెండ్ కాబట్టి ఈరెండు రోజుల్లో ఈసినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























