ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ సినిమా ఒకటి. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఈసినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఎప్పటినుండో సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆడియన్స్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలన్న నేపథ్యంలో గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు లేట్ అవుతుంది. తాజాగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో తేజ సజ్జ చేతిలో హనుమాన్ జెండాతో ఒక కొండపై నుండి మరొక కొండ మీదికి దూకడం కనిపిస్తుంది. మరి వచ్చే ఏడాది పలు పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్ గుంటూరు కారం అయితే ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇంకా ముందు ముందు పెద్ద హీరోల సినిమాలు ఈ లిస్ట్ లో చేేరే అవకాశమే ఉంది. చూద్దాం మరి పెద్ద హీరోల దాటిని ఈ హనుమాాన్ ఎలా అధిగమిస్తాడో.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: