టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రంగబలి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ ప్లస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా జులై 7వ తేదీన రిలీజ్ కానుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కలకంటూ ఉంటే అది కరిగి కరిగి అంటూ ఈ పాట సాగుతోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. సార్థక్ కల్యాణి, వైష్ ఆలపించారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































