మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక అప్పుడప్పుడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు మేకర్స్. చిరు అయితే స్పెషల్ గా చిరు లీక్స్ పేరుతో అప్ డేట్లు ఇస్తున్నాడు. రీసెంట్ గానే ఓ కలప్ పుల్ సాంగ్ మేకింగ్ కు సంబంధించిన చిన్న వీడియోను కూడా షేర్ చేశాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్ కు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాడట మెహర్ రమేష్. హైద్రాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని రోజులుగా పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ రాత్రి పూట చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవితో పాటు కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవి శంకర్ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























