రంభ ఊర్వశి మేనక  టైటిల్ సాంగ్‌ రిలీజ్ 

Ramba oorvashi Menaka Title Song Released

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీజర్‌కి, ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. తప్పకుండా దీనికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థియేటర్‌లో ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. ఈ సినిమా షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.  ఇప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ప్రిశా సింగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సాంగ్‌కి అందరూ డాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని యాక్టింగ్ చేయడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ఈ పాట మీ అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది. తప్పకుండా సెప్టెంబర్ 4వ తేదీన థియేటర్‌లో కలుద్దాం. తప్పకుండా ఈ సినిమాని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘రంభ ఊర్వశి మేనక’ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలను ఒక డాన్స్‌కి లేకపోతే ఒక సన్నివేశానికి రావడం చూశాము. కానీ ఈ కథ మాత్రం చుట్టూ రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ అడిరిపోతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.