తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు మేకర్స్. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో మెప్పించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా పల్లెటూరి మాస్ అండ్ కామిక్ యాసతో సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే.. అంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థం అనే పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్, ఆ తర్వాత ఫుల్ లెంత్ హిలేరియస్ అండ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనకు కాబోయే భార్య ‘సుకుమారంగా, సుకుమారిలా ఉండాలి’ అని కోరుకునే హీరోకి, ‘దామిని’ (ఐశ్వర్య రాజేష్) అనే ఒక అమ్మాయి పరిచయం కావడం చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది . అయితే హీరోయిన్ దామినికి ఒక చిన్న సమస్య ఉంటుందని, కేవలం ‘ఒక్కటే ఒక్క నిజం’ దాచిపెట్టి ఈ పెళ్లి చేస్తున్నామంటూ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ట్విస్ట్ కథపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్, కాజల్ తరహాలో వీరిది కూడా జన్మ జన్మల బంధం అంటూ వచ్చే కామెడీ డైలాగ్స్ టీజర్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి .
దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, లవ్ అండ్ హ్యూమరస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విలేజ్ నేటివిటీ విజువల్స్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి . థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ను త్వరలోనే చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























