కోలీవుడ్‌లో కరుప్పు ఊచకోత.. తమిళనాడులోనే 175 కోట్లు

Karuppu Crosses ₹175 Crores in Tamil Nadu

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అధిగమించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య – డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ‘సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్’ రన్‌ను కొనసాగిస్తోంది. కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే ఈ చిత్రం రూ. 175 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా అన్‌స్టాపబుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

తమిళనాడు సినీ చరిత్రలో రూ. 175 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన అతికొద్ది చిత్రాల సరసన ‘కరుప్పు’ నిలిచింది. సూర్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైలురాయిగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

సూర్య వన్-మ్యాన్ షో, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం వీకెండ్స్ లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్ల వద్ద పబ్లిక్ ఆక్యుపెన్సీ అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ ‘సూర్య రోర్’ కనిపిస్తోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కర్ణాటక, కేరళతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 300కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సూర్యకు ఈ క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి. ఇక ఈసినిమాతో వరుస పరాజయాల తరువాత సూర్య సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.