పెద్ది రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది – ఏఆర్ రెహమాన్

Peddi Gave Me a Special Opportunity Says A. R. Rahman

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హల్లల్లల్లో’ ని భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ లో లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. భోపాల్ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో ఈ ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. నేను సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు తెలుగు డబ్ గా విడుదలయ్యాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపించారు. చాలా కాలంగా నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది. బుచ్చిబాబు గారు ఈ కథను చెప్పినప్పుడు ఈ కథ, ఆయనలోని ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌తో నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.