పెద్ది కూడా దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా – రామ్ చరణ్

Ram Charan Calls Peddi a Rare Once-in-a-Decade Film

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ… గుడ్ ఈవెనింగ్ ముంబై. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రాణం పెట్టి పని చేశాం. బుచ్చిబాబు అయితే గత ఐదేళ్లుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. బుచ్చిబాబుకి ఒక విషయంలో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. రెహమాన్ గారిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చేలా కన్విన్స్ చేశారు (నవ్వుతూ). ప్రతి ప్రాజెక్ట్‌కు నాలుగు పిల్లర్లు ఉంటాయి. కానీ మా ప్రాజెక్ట్‌కు సెంటర్ పిల్లర్ రెహమాన్ గారు. రెహమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ‘పెద్ది’లో భాగం కావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దివ్యేందు ఒక గ్యాంగ్‌స్టర్‌. తనకంటూ ఓ స్టైల్‌ స్వాగ్ కనిపిస్తాడు. రత్నవేలు గారితో ఇది నాకు ఐదో చిత్రం. ఆయన మాస్టర్. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జాన్వి చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. తనలో చాలా డెడికేషన్ ఉంది. తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది. మా నాన్నగారు, శ్రీదేవి మేడం కలిసి సినిమాలు చేశారు. జాన్వి, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

ఇది మాకు ఒక నోస్టాల్జిక్ మూమెంట్. బుచ్చిబాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇక్కడికి వచ్చిన తెలుగు అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ఈ క్యారెక్టర్ చేయడం ఫిజికల్‌గా చాలా చాలెంజింగ్. సల్మాన్ ఖాన్ గారు, ఆమిర్ ఖాన్ గారు ‘సుల్తాన్’, ‘దంగల్’ లాంటి చిత్రాలతో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే ఈ పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మ్ అవ్వాలని తెలుసు. ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. అందరికీ ఒక ఐడెంటిటీ కావాలి.
అలాంటి ఐడెంటిటీ కోసం చేసే ప్రయాణం.ఈ కథని దర్శకుడు చాలా ఆర్గానిక్‌గా, అలాగే హైలీ కమర్షియల్‌గా చూపించారు. ప్రేక్షకులందరూ చాలా సర్‌ప్రైజ్ అవుతారు.

నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. పెద్ది కూడా లాంటి అరుదైన సినిమా . ‘ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ఇలాంటి సినిమా చేస్తున్నపుడు ప్రతిక్షణం ఆస్వాదించాలి’ అని నాన్నగారు చెప్పేవారు. మంచి సినిమాలు అంత ఈజీగా రావు. ‘మగధీర’ చెప్సిన ఏళ్ల తర్వాత ‘రంగస్థలం’ వచ్చింది. తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. లక్కీగా పెద్ది త్వరగానే వస్తుంది. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.