ఐ యామ్ గేమ్ ఆగస్టులో రిలీజ్

August Release Locked for I Am Game

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో “ఐ యామ్ గేమ్”నే అత్యంత స్టైలిష్ ఫిల్మ్ అని తెలిపారు. సినిమాలో తన పాత్రతో పాటు మొత్తం వరల్డ్‌ని చాలా మోడర్న్, స్టైలిష్‌గా డిజైన్ చేశారని చెప్పారు. దర్శకుడు నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా తనని ఓ కొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించాలని భావించారని, అదే ఈ ప్రాజెక్ట్‌కు హైలెట్ గా మారిందని తెలిపారు.

బ్లాక్‌బస్టర్ ‘ఆర్‌డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను 2026 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మలయాళ సినీ పరిశ్రమలో కూడా అత్యంత పెద్ద రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన అందించారు. ‘లోకా’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం ఇదే.

ఇటీవల తన సినిమాల్లో ఎక్కువగా వింటేజ్ లుక్స్‌లో కనిపించిన దుల్కర్, ఈసారి పూర్తిగా భిన్నమైన స్టైలిష్ మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇది ఆయన 40వ చిత్రం కావడం విశేషం. భారీ స్థాయిలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ స్టంట్ డ్యుయో అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘ఐ యామ్ గేమ్’ మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.