ఫౌజీ షూటింగ్ కోసం వెళ్తున్న వాహనానికి ప్రమాదం .. ఒకరి మృతి

Accident Involving Vehicle Heading to Fauji Shoot

రెబల్ స్టార్ ప్రభాస్- డైరక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’. సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా షూటింగ్ కోసం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద షూటింగ్ కోసం వెళ్తున్న యూనిట్ వాహనం ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ ను డీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఒకరు మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.అందులో భాగంగా యూనిట్ వాహనం ఈ షెడ్యూల్ కోసం వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదకర ఘటనతో చిత్ర యూనిట్‌లో ఆందోళన నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.