కింగ్ 100 లో జాయిన్ అయిన టబు

Tabu Starts Shooting for #KING100

కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది.తమిళ దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

నాగార్జున–టబు కాంబినేషన్ లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. సిసింద్రీ లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.