మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘హ్యాపీరాజ్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. గత నెల థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళ్, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో తెలుగు అమ్మాయి శ్రీ గౌరీప్రియ కథానాయికగా నటించింది.చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు అబ్బాస్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వగా, జార్జ్ మార్యన్ ఒక ప్రధాన పాత్ర పోషించారు. మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగం చేసే ముత్తు అనే వ్యక్తి తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు.అయితే అతని రూపురేఖల కారణంగా ఊరి వారు హేళన చేస్తుంటారు. ఈ క్రమంలో అతని కుమారుడు ఆనంద్ సిటీకి వెళ్లి కావ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.వీరిద్దరి నిశ్చితార్థం సమయంలో ఆనంద్ కుటుంబాన్ని చూసి కావ్య తండ్రి రాజీవ్ తన స్టేటస్కు సరిపోరని అవమానిస్తాడు.ఈ గొడవల తర్వాత విడిపోయిన ఆనంద్ మరియు కావ్య తిరిగి తమ పెద్దలను ఎలా ఒప్పించారు, ఆనంద్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























