నటీనటులు: అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ , అనురాగ్ కశ్యప్ , ప్రకాష్ రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: ధనుష్ భాస్కర్
కథ & స్క్రీన్‌ప్లే: అడివి శేష్
దర్శకత్వం: షానియల్ డియో
నిర్మాత : సుప్రియా యార్లగడ్డ , సునీల్ నారంగ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ ఈసారి మాస్ యాక్షన్ మరియు ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఈ చిత్రానికి అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మృణాల్ ఠాకూర్ మొదటిసారి శేష్‌తో జతకట్టడం, అలాగే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. మదనపల్లి నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, ఎమోషన్ మరియు ఒక విభిన్నమైన ప్రేమ ప్రయాణం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిందో ? లేదో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
హరిదాస్ (అడివి శేష్) ఒక హత్య కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. తనను జైలు పాలు చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. కానీ, ఆమెను కలిసినప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆమె భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటం, వైద్యం కోసం కోటి రూపాయలు అవసరం కావడంతో హరి ఆమె ఆర్థిక అవసరాన్ని వాడుకుని పగ తీర్చుకోవాలనుకుంటాడు. అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు? సరస్వతి హరిని ఎందుకు ఇరికించింది? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
కథ హరిదాస్ అనే వ్యక్తి జైలు జీవితంతో మొదలవుతుంది. గతంలో జరిగిన ఒక హత్య కేసు కారణంగా 13 ఏళ్ల పాటు కడప జైలులో శిక్ష అనుభవిస్తున్న హరి, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంతో సినిమా వేగం పుంజుకుంటుంది. తను ప్రేమించిన అమ్మాయే తనను జైలు పాలు చేసిందనే కోపం, పగతో ఆమెను వెతుక్కుంటూ హరి ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మరియు ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి. విరామ సన్నివేశాలు కూడా ఆసక్తిని కలిగిస్తాయి.
ద్వితీయార్ధంలో కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయితే, ఛేజింగ్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ భావోద్వేగంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉండే వైరం, వారు కలిసి చేసే సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా అడివి శేష్ తన కెరీర్‌లో మొదటిసారి మదనపల్లి యాసలో డైలాగులు చెప్పడం కొత్తగా ఉంటుంది. మృణాల్ ఠాకూర్ ఒక చిన్న పాప తల్లిగా, గృహిణిగా కనిపిస్తూనే కథలో వచ్చే మలుపులకు తగ్గట్లుగా తన నటనతో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే ఎమోషన్స్ గుండెను హత్తుకునేలా ఉంటాయి.
అడివి శేష్ సినిమాల్లో ఉండే వైవిధ్యం, థ్రిల్ ఈ సినిమాలోనూ ఆశించినప్పటికీ, కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం ఒక్కటే కొంచెం మైనస్ గా చెప్పొచ్చు. ఒక సాధారణ కులాంతర ప్రేమకథకు యాక్షన్ జోడించి ఆకట్టుకొనే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
నటీనటుల విషయాన్ని వస్తే అడివి శేష్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ మరియు స్పై థ్రిల్లర్ పాత్రల్లో కనిపించిన శేష్, ఈ సినిమాలో ‘హరిదాస్’గా పూర్తి మాస్ లుక్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా మదనపల్లి యాసలో ఆయన పలికిన సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా, క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పరిణతి చెందిన నటనను కనబరిచారు.
మృణాల్ తన పాత్రలో ఒదిగిపోయారు. ఒక ఆరేళ్ల పాప తల్లిగా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న గృహిణిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. మాటల కంటే కళ్లతోనే భావోద్వేగాలను పండించడంలో ఆమె సఫలమయ్యారు. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక రకమైన గాంభీర్యాన్ని తీసుకొచ్చింది.ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన అనుభవంతో కూడిన నటనను అందించగా, సునీల్, కామాక్షి భాస్కర్ల మరియు అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.
టెక్నికల్ గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా వుంది. దర్శకుడు షానియల్ డియో ఈ యాక్షన్ డ్రామాను తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. ముఖ్యంగా యాక్షన్ మరియు ఛేజింగ్ సీక్వెన్స్‌లను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.: కథలో పాత సినిమాల ఛాయలు ఉన్నప్పటికీ, శేష్ తన స్క్రీన్‌ప్లేతో అక్కడక్కడా మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.
భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. ‘పాలపిట్టరో..’ రీమిక్స్ సాంగ్ థియేటర్లో ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. గ్యాని బీజీఎమ్ అదరగొట్టాడు.యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఒక పెద్ద అసెట్. మదనపల్లి పరిసరాలను, యాక్షన్ ఘట్టాలను చాలా రిచ్‌గా కెమెరాలో బంధించారు. నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి.
‘డెకాయిట్’ చిత్రం ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా. కథలో పాతకాలపు ఛాయలు ఉన్నప్పటికీ, అడివి శేష్ మార్క్ స్క్రీన్‌ప్లే మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను ఆసక్తికరంగా మార్చాయి. అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాను ఈజీగా ఓసారి చూడవచ్చు. యాక్షన్ ప్రియులకు మరియు అడివి శేష్ అభిమానులకు ఈ చిత్రం మంచి వినోదాన్ని అందిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























