రివ్యూ : బైకర్ – రేస్ అదిరింది

biker review in telugu

నటీనటులు : శర్వానంద్,మాళవిక నాయర్,డాక్టర్ రాజశేఖర్,అతుల్ కుల కర్ణి ,బ్రహ్మాజీ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రచన & దర్శకత్వం : అభిలాష్ రెడ్డి కంకర

నిర్మాతలు: వంశీ, ప్రమోద్

సంగీతం: జిబ్రాన్

ఛాయాగ్రహణం : జె. యువరాజ్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్. ప్రకాష్

శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ చిత్రం సరికొత్త ‘మోటోక్రాస్ రేసింగ్’ నేపథ్యంలో తెలుగు వెండితెరపై ఒక అరుదైన ప్రయోగానికి తెరలేపింది.ప్రమోషనల్ కంటెంట్ తోనే రిలీజ్ కుముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈసినిమా నిన్నటి పెయిడ్ ప్రీమియర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరి నేడుథియేటర్లలో విడుదలైన ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక అద్భుతమైన బైక్ రేసర్. అతని తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) స్వయంగా అతనికి కోచ్‌గా వ్యవహరిస్తుంటారు. భారతదేశంలో బైక్ రేసింగ్‌కు అంతగా ఆదరణ లేని సమయంలోనే, వికాస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంటాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి మలేషియా వెళతారు. అయితే, అక్కడ రేస్ ముగిసిన వెంటనే, తదుపరి పోటీలకు వెళ్లకుండానే వికాస్ హఠాత్తుగా ఇండియా తిరిగి వచ్చేస్తాడు. అంతేకాకుండా, తన తండ్రికి కనిపించకుండా విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ దూరంగా వెళ్లిపోతాడు.

అసలు ప్రాణంగా ప్రేమించే తండ్రీకొడుకుల మధ్య అంతటి దూరం ఏర్పడటానికి బలమైన కారణం ఏమిటి? తండ్రికి దూరంగా వెళ్లిన వికాస్, మళ్ళీ వెనక్కి వచ్చి రేసింగ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? కొడుకును మళ్ళీ దగ్గరకు తీసి సునీల్ నారాయణ్ ట్రైనింగ్ ఇచ్చాడా లేదా? విక్కీని రేసింగ్ చేయవద్దని అతని భార్య అనూష (మాళవికా నాయర్) ఎందుకు వారించింది? విక్కీ ఓటమిని కోరుకుంటున్న ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి) అసలు ఎవరు? నారాయణ్ తండ్రీకొడుకులకు మరియు ఇంద్రనీల్‌కు మధ్య ఉన్న పాత పగ ఏమిటి? చివరికి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విక్కీ విజేతగా నిలిచి తన తండ్రి కలను నెరవేర్చాడా లేదా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :

యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర మోటోక్రాస్ రేసింగ్‌ను ఎంచుకోవడంలోనే తన అభిరుచిని చాటుకున్నారు. రేసింగ్‌కు సంబంధించిన టెక్నికల్ అంశాలను ఎంతో నేర్పుగా, అత్యున్నత ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లోని రేసింగ్ విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఇక తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ ట్రాక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ తండ్రి పాత్రలో ఒదిగిపోయి తన నటనతో ఆశ్చర్యపరిచారు.

సినిమా ప్రారంభం వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) పాత్ర పరిచయం మరియు అతనికి బైక్ రేసింగ్ పట్ల ఉన్న అమితమైన ఇష్టాన్ని చూపిస్తూ ఎనర్జిటిక్‌గా మొదలవుతుంది. ఆ తరువాత సునీల్ నారాయణ ఎంట్రీ ఇవ్వడం , హీరో- హీరోయిన్ లవ్ ట్రాక్ , తండ్రి – తనయుల అనుబందం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపిస్తుంది.

రెండవ సగంలో అసలైన మోటోక్రాస్ రేసింగ్ సందడి మొదలవుతుంది. రేసింగ్ ట్రాక్ పైన వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా మలేషియా వంటి ప్రదేశాల్లో చిత్రీకరించిన రేసింగ్ ఎపిసోడ్లు సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. సాంకేతికంగా ఈ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న విభేదాలు తొలగి, వారిద్దరూ ఒకే లక్ష్యం కోసం ఎలా పోరాడారు అనే భావోద్వేగపూరితమైన అంశాలు సెకండాఫ్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ రేసింగ్ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.మొత్తానికి సెకండాఫ్ రేసింగ్ ప్రియులను మరియు ఎమోషనల్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.

శర్వానంద్ ఈ సినిమా కోసం పడ్డ శ్రమ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, స్టైలింగ్ మరియు ఫిజిక్ పక్కా రేసర్‌లా చాలా షార్ప్‌గా ఉన్నాయి. తన సహజ నటన మరియు చార్మింగ్‌తో సినిమాను భుజాన వేసుకుని నడిపించారు. సంగీత పరంగా ఒక డ్యూయెట్ మరియు రెండు థీమ్ సాంగ్స్ వినడానికి, చూడటానికి బాగున్నాయి. నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం మరియు నేపథ్య సంగీతం సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి.డాక్టర్ రాజశేఖర్ చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరిశారు. తండ్రి పాత్రలో ఆయన హుందాతనం, కొడుకుపై ఉన్న ప్రేమని వ్యక్తపరిచే తీరు సినిమాకు ప్రాణం పోశాయి.

సాంకేతికంగా కూడా సినిమా ఉన్నంతగా వుంది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్ల సమయంలో థియేటర్‌లో విజిల్స్ వేయించేలా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. జె. యువరాజ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రేసింగ్ ట్రాక్ పై కెమెరా మూమెంట్స్ ప్రేక్షకులను కూడా రేసింగ్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.యువి క్రియేషన్స్ మేకింగ్ స్టాండర్డ్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

మొత్తానికి ‘బైకర్’ ఒక పక్కా యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రైడ్ అలాగే సాహసోపేతమైన ప్రయత్నం కూడా . ఓ బలమైన ఎమోషనల్ పాయింట్‌ను సరికొత్త మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడే వారితో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.