లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు టీజర్ రిలీజ్.. 2040 లో ప్రేమకథ

Love Insurance Company Teaser Reveals a 2040 Love Story

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ నేడు విడుదలైంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినూత్న చిత్రాల దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను 2040 నాటి భవిష్యత్తు నేపథ్యంలో ఒక విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కించారు. నేడు విడుదలైన తెలుగు టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. టెక్నాలజీ రాజ్యమేలుతున్న కాలంలో మనుషుల మధ్య భావోద్వేగాలు, ప్రేమ, రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయనే అంశాన్ని చాలా సరదాగా, కలర్ ఫుల్ విజువల్స్ తో చూపించారు. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీ, కృతి శెట్టి గ్లామర్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. వెర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య ఇందులో ఒక పవర్ ఫుల్ కార్పొరేట్ బాస్ పాత్రలో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. శ్రీ పద్మిని సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది. నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ మరియు ఎల్.కె. విష్ణు కుమార్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ లో చూపిన ‘2040’ నాటి ప్రపంచం, ఎగిరే కార్లు, వింత గ్యాడ్జెట్లు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

అన్ని అడ్డంకులను దాటుకుని ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.