వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం ఇది కలనో విడుదల

IdhiKalano the soulful love song from VandaDevullu is out now

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. విజయ్ ఆంటోనీ, స్వాసిక మాసీ లుక్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘ఇది కలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో విజయ్ ఆంటోని, స్వాసిక కనిపిస్తున్న తీరు, వారి ప్రేమను వ్యక్త పరుస్తున్న విధానం ఎంతో చక్కగా ఉంది. ఇక ఈ పాటకు భాగ్య శ్రీ అందించిన సాహిత్యం, శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. బాలాజీ శ్రీరామ్ అందించిన బాణీ శ్రోతల్ని ఇట్టే కట్టి పడేసేలా ఉంది.

ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ను టీం అలరించనుంది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.