యంగ్ హీరో శర్వానంద్ నటించిన హై-వోల్టేజ్ మోటార్‌స్పోర్ట్ డ్రామా ‘బైకర్’ రన్ టైమ్ లాక్ అయింది.ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలుగా ఉండనుంది. ఒక స్పోర్ట్స్ డ్రామాకు ఇది కాస్త ఎక్కువే అయినప్పటికీ, సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేయగా శర్వానంద్ సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటించింది సీనియర్ హీరో రాజశేఖర్ శర్వానంద్‌కు తండ్రిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. అతుల్ కుల్కర్ణి, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించాడు.
భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో సాగే చిత్రమిది. ఒక మధ్యతరగతి యువకుడు బైక్ రేసింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును ఎలా సంపాదించుకున్నాడు అనేదే ఈ సినిమా కథాంశం.ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.అయితే ముందు రోజు సెలెక్టెడ్ థియేటర్లలో ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























