యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘గువ్వల చెరువు ఘాట్’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ‘గువ్వల చెరువు ఘాట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్, ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, ఒక రివేంజ్ డ్రామా నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. పవర్ఫుల్ విజువల్స్ మరియు ఇంటెన్సివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కిరణ్ అబ్బవరంతో పాటు ‘మసూద’ ఫేమ్ తిరువీర్, సంయుక్త మీనన్, సిద్ధిక్, ఆడుకాలం నరేన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.’డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన మేకింగ్ స్టైల్ ఈ గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ముంబైలో జరిగిన ‘ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ 2026’ ఈవెంట్లో ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.కిరణ్ అబ్బవరం రూట్ మార్చి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























