పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్ లో సత్తా చాటుతోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా, అడ్వాన్స్ సేల్స్ పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటడంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేదిశగా సాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా మేనియా మామూలుగా లేదు. ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే 2,50,000 డాలర్ల ($250K) అడ్వాన్స్ సేల్స్ నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) జరగనున్న ప్రీమియర్ల నాటికి ఇది 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం బెనిఫిట్ షోలకు మరియు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో అక్కడ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంచడం వల్ల ప్రేక్షకులు బుకింగ్స్ బాగున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఇప్పటికే 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. కర్ణాటక మరియు మిగిలిన భారతదేశంలో కూడా ఈ సినిమా బుకింగ్స్ నిన్నటి నుండి పుంజుకున్నాయి.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ గత చిత్రం ఓజీ తో పోలిస్తే దీనిపై ఉన్న హైప్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఉగాది మరియు రంజాన్ సెలవులు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జస్ట్ హిట్ టాక్ వస్తే వస్తే చాలు లాంగ్ రన్‌లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























