యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ భారీ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ‘అచ్చియ్యమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తోంది. ఆమె లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టం, సెట్స్‌లో ఆమె సందడిని ఈ వీడియోలో చూడవచ్చు.
జాన్వీ కపూర్ నటనను, అందాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సందర్భంగా కొనియాడారు. ”మాటలకు అందని చక్కదనం, కళ్లతోనే భావాలను పలికించగల పర్ఫార్మన్స్ జాన్వీ కపూర్ సొంతం. కాటుక అక్కర్లేని ఆ కళ్లు, అలంకరణ అక్కర్లేని సహజమైన అందం ఆమెది” అని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఆమెతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ‘అచ్చియ్యమ్మ’గా ఆమెను వెండితెరపై చూపేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.’పెద్ది’ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































