వృషకర్మలో స్పర్శ్  చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు – డైరెక్టర్ కార్తీక్

Sparsh’s Character in Vrushakarma Will Be Extraordinary says Director Karthik

యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక తాజాగా , మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లింప్స్ భారీ స్కేల్, అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక భారీ సినీమాటిక్ యూనివర్స్‌ను నిర్మించాలనే మేకర్స్ విజన్ స్పష్టంగా కనిపిస్తోంది.నాగ చైతన్య రగ్గడ్, ఇంటెన్స్ అవతార్‌లో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్లలో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రా, ఫియర్స్ లుక్ గ్లింప్స్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది. దుష్ట శక్తులకు ఎదురొడ్డి నిలిచే యోధుడిలా ఆయన పాత్ర కనిపిస్తోంది.

స్పర్ష్ శ్రీవాస్తవ పోషించిన భయంకరమైన విలన్ పాత్ర మరో హైలెట్. ఆయన టెర్రిఫిక్ ప్రెజెన్స్ కథలో ఇంటెన్స్ ఘర్షణకు సంకేతాలు ఇస్తోంది. అలాగే హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి, జయరామ్ పోషించిన పాత్రను గ్లింప్స్ లో కీలకంగా కనిపించాయి.దర్శకుడు కార్తిక్ దండు ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నీ జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను అందుకునేలా ఒక ఇమర్సివ్ సినీమాటిక్ అనుభూతిని ఇవ్వనున్నారు.

సినిమాటోగ్రాఫర్ రాహుల్ డి హెరియన్ అందించిన విజువల్స్ అద్భుతంగా కనిపిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాలా నిర్మించిన ప్రపంచం రిచ్‌గా అనిపిస్తోంది. అజినీస్ లోక్ నాథ్ అందించిన పవర్‌ఫుల్, హాంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఎడిటర్ నవీన్ నూలి చేసిన షార్ప్ కట్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మొత్తంగా “వృషకర్మ” ఫస్ట్ గ్లింప్స్ ఒక టెర్రిఫిక్ సినీమాటిక్ అనుభూతిని అందిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఇక డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విరూపాక్ష సినిమా ఇచ్చిన సుకుమార్ గారికి థాంక్యూ. సుకుమార్ గారు బాపి గారు మా ముగ్గురి కాంబోనేషన్ లో విరూపాక్ష చేశాం, ఆ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరింత గొప్ప సినిమా తీసే అవకాశం ఆడియన్స్ ఇచ్చారు. ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా చేయడానికి కావలసిన సపోర్టు నిర్మాతల నుంచి ఉంది. ప్రతి దర్శకుడికి పనిచేసే హీరోతో వాళ్ల కెరీర్ బెస్ట్ ఫిలిం ఇవ్వాలని ఉంటుంది. చైతన్య గారికి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నాను. టెక్నీషియన్స్ అందరు కూడా అద్భుతంగా పని చేశారు. అన్ని పాత్రలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు. ఆ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మీరు కొత్త నాగచైతన్యని చూస్తారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.