ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

Ugadi Release Locked for Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ముందుగా అనుకున్న తేదీ కంటే ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈ సినిమాను 2026, మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ తొలుత నిర్ణయించారు. అయితే, యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో, ఆ ఖాళీని భర్తీ చేస్తూ ఉగాది పండుగ కానుకగా 2026, మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత” అంటూ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలకు స్వరాలు అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (బాధ్యతలను ఎస్.ఎస్. తమన్ తీసుకున్నారు. సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.మార్చి 19న ఉగాది, ఆ వెంటనే రంజాన్ మరియు శ్రీరామనవమి సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న పక్కా మాస్ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.