ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎమ్ కోసం తమన్

Thaman Roped in for Ustaad Bhagat Singh’s BGM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా నేపథ్య సంగీతం అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్కు అప్పగించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణంగా ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు ఉంటారు, కానీ ఈ చిత్రానికి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తుండటం విశేషం. ఈ సినిమాలోని పాటలన్నింటికీ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే అద్భుతమైన బాణీలు అందించారు. అయితే, సినిమా విడుదల తేదీని మార్చి 19కి ముందుకు జరపడం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం తక్కువగా ఉండటంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తమన్‌కు అప్పగించాలని దర్శకుడు హరీష్ శంకర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించారు.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలకు తమన్ అందించిన బీజీఎమ్స్ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు మరోసారి తమన్ తన పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో ‘ఉస్తాద్’ యాక్షన్ సీక్వెన్స్‌లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారని అభిమానులు ఆశిస్తున్నారు. డీఎస్పీ పాటలు, తమన్ బీజీఎమ్.. ఈ ఇద్దరి కలయిక సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.