విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ నుండి మొదటి పాట అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని మొదటి పాట ‘నమో రే’ ను మార్చి 15వ తేదీన ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో మార్చి 12 అని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ మార్చి 15వ తేదీని ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాటను భగవంతుడైన శ్రీమన్నారాయణుడికి భక్తిపూర్వక నిరాజనంగా మలుస్తున్నారు. సుమారు 1,000 మంది నృత్యకారులతో అత్యంత భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించారు. దీని కోసం పద్మనాభస్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్‌ను నిర్మించడం విశేషం.
విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్ ‘పార్వతి’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రిషబ్ సాహ్నీ, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అభే మరియు జునైద్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గణేష్ ఆచార్య ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు.మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమాను వేసవిలో విడుదలచేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































