టాక్సిక్ విడుదల వాయిదా..కొత్త రిలీజ్ డేట్ ఇదే

Toxic Makers Announce Revised Release Date

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని 2026, మార్చి 19న ఉగాది మరియు ఈద్ పండుగల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (గల్ఫ్ దేశాల) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నేడు అధికారికంగా ప్రకటించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులను మరియు డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాను ఇప్పుడు 2026, జూన్ 4న విడుదల చేయాలని ఖరారు చేశారు.ఇక మార్చి 8న బెంగళూరులో జరగాల్సిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతానికి రద్దు చేయబడింది.ఇప్పటివరకు ఈసినిమానుండి గ్లిమ్ప్స్ ,టీజర్ అలాగే ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి.

గల్ఫ్ దేశాలు ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్ కావడంతో, అక్కడ సినిమా కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో నేరుగా రూపొందుతూ, తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడుతోంది.ఇక టాక్సిక్ విడుదల వాయిదా పడడంతో మార్చి 19న ధురంధర్ 2 సోలో గా విడుదలకానుంది. దాంతో ఈసినిమా రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.