మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కుదిరితే ఈ వారంలోనే ఈట్రైలర్ వదులాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.
ఇక ఈ సినిమా నిడివి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ దాదాపు 3 గంటల 45 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో రాబోతోంది.ఇది బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత నిడివి గల సినిమాల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ సినిమా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.అయితే అదే రోజున కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘బిగ్గెస్ట్ క్లాష్’ ఖాయంగా కనిపిస్తోంది.
రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సీక్వెల్‌లో నటించారు. ఇక ధురంధర్ 1400కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించడం తో ఈ సీక్వెల్ పై హిందీ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































