టాక్సిక్ టీజర్ రిలీజ్

Much-Awaited Toxic Teaser Released

రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ అఫీషియల్ టీజర్ నేడు విడుదలైంది. ‘కేజీఎఫ్-2’ తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం అనంతరం యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ టీజర్ ను రక్తపాతం తో నింపేశారు.టీజర్ చూస్తుంటే సినిమా ఎంత వయలెంట్ గా వుండబోతుందో అర్ధమవుతుంది. ఇందులో యష్ ‘రాయా’ అనే పాత్రలో విదేశీ గ్యాంగ్‌స్టర్లను వేటాడుతూ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు.క్వాలిటీ విజువల్స్ , పవర్ ఫుల్ బీజీఎమ్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో  యష్ డ్యూయెల్ రోల్ లో  కనిపించనున్నాడు. టీజర్ లో చివర్లో చూపించిన సన్నివేశాలు సప్రైజ్ చేశాయి.ఇందులో యష్ లుక్  ఆకట్టుకుంది. 

ఈ చిత్రం 1940 మరియు 1970ల మధ్య గోవా నేపథ్యంలో సాగే ఒక క్రూరమైన యాక్షన్-థ్రిల్లర్ అని సమాచారం. ఒక గ్యాంగ్‌స్టర్ తన సామ్రాజ్యాన్ని రక్తం మరియు భయంతో ఎలా నిర్మించాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఈ పాన్-ఇండియా చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.విలక్షణ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు లో ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.