నటీనటులు : సుహాస్, శివానీ నాగారం,నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్, , నెల్లూరు సుదర్శన్,
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : మహీ రెడ్డీ పండుగుల
కూర్పు : విప్లవ్ నైషధం
దర్శకుడు : గోపి అచ్చర
నిర్మాత: నరేంద్రరెడ్డి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హే బల్‌వంత్’.ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి హైప్ తెచ్చిపెట్టింది. నిజానికి ఈసినిమాకు హే భగవాన్ అనే టైటిల్ అనుకున్నారు కానీ సెన్సార్ నుండి అభ్యంతరాలు రావడంతో హే బలవంత్ గా మార్చారు. మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమాఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
చిన్నప్పటి నుంచీ తన తండ్రి రావు బల్‌వంత్ (నరేశ్)ను ఓ హీరోలా భావిస్తుంటాడు కృష్ణ (సుహాస్). తండ్రి చేసే వ్యాపారాన్ని తాను కూడా చేపట్టి పేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు. అయితే, తండ్రి చేసే ఆ వ్యాపారం ఏంటో తెలిశాక కృష్ణ జీవితం తలకిందులవుతుంది. ఆ వ్యాపారం వల్ల కృష్ణ ప్రేమకు, జీవితానికి ఎదురైన సమస్యలేంటి? ఆ సమస్యల నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథ.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రధానంగా “రహస్య వ్యాపారం” అనే అంశంపై నడుస్తుంది. సాధారణంగా తండ్రులు తమ పిల్లల కోసం పడే కష్టాన్ని బయటకు చెప్పుకోరు, కానీ ఇందులో నరేశ్ చేసే వృత్తి సమాజంలో కాస్త భిన్నంగా చూడబడేది కావడంతో, దానిని కొడుకు నుండి దాచడం.. తీరా అది తెలిశాక సుహాస్ పడే ఆందోళనను దర్శకుడు చాలా వినోదాత్మకంగా మలిచారు.
సినిమాలోని మొదటి సగం హీరో తండ్రి చేసే రహస్య వ్యాపారం చుట్టూ తిరిగే కామెడీతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా సుహాస్, సుదర్శన్‌ల మధ్య వచ్చే మందు సిట్టింగ్ సీన్, ప్రకృతి వైద్యం ఎపిసోడ్‌లో వెన్నెల కిశోర్ హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.. శివానీ నాగారం తన పాత్రకు న్యాయం చేసింది. నెల్లూరు సుదర్శన్ బాబు మోహన్, అజయ్ ఘోష్ తదితరులు తమ నటనతో నవ్వులు పూయించారు.
ద్వితీయార్ధం కొంత థ్రిల్లింగ్‌గా, మరికొంత ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి పాత్రలోని లోతు, ఆయన ఆ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలను దర్శకుడు హృద్యంగా చూపించారు. క్లైమాక్స్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి
నటీనటుల ప్రతిభ:
సుహాస్ ఎప్పటిలాగే తన ‘బాయ్ నెక్స్ట్ డోర్’ లుక్‌తో మెప్పించారు. ముఖ్యంగా షాకింగ్ విషయాలు తెలిసినప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. సీనియర్ నటుడు నరేశ్ ఈ సినిమాలో ‘రావు బల్‌వంత్’ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఆయన పండించిన ఎమోషన్స్ సినిమాకు ప్రాణం పోశాయి.
కండాఫ్‌లో వెన్నెల కిశోర్ ఎంట్రీ తర్వాత సినిమా వేగం పెరుగుతుంది. శవాన్ని మాయం చేసే క్రమంలో ఆయన చేసే హడావిడి, డైలాగ్స్ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ గోపీ అచ్చర దర్శకత్వం, కథను నడిపించిన తీరు బాగుంది. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్‌ను ఇచ్చింది. మామూలు సన్నివేశాలను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని, మధ్యతరగతి ఇళ్లను చాలా సహజంగా చూపించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే షార్ప్ రన్ టైం సినిమాకు ప్లస్ అయ్యింది.నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు గా వున్నాయి.
ఓవరాల్ గా ‘హే బల్‌వంత్’ మంచి వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్ ఉన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.ఫ్యామిలీ తో కలిసి ఈసినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























