రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రకాష్ రాజ్ స్వయంగా తన పాత్ర గురించి ఓ ఈవెంట్ లో వెల్లడిస్తూ, ఈ సినిమాలో తాను ఒక ‘మహా శివ భక్తుడి’ పాత్రలో కనిపిస్తానని తెలిపారు. ఈ పాత్రలో శివుడి పట్ల ఉండే భక్తి, ఆవేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, తన నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మొదట్లో ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆయన ‘మహా శివ భక్తుడిగా’ కనిపిస్తానని చెప్పడంతో, కథలో ఈ పాత్ర చాలా కీలకంగా మరియు మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన ప్రకాష్ రాజ్ , సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఒక నటుడిగా నా ఆకలిని తీర్చిన అద్భుతమైన షెడ్యూల్ ఇది” అని రాజమౌళి మరియు మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’లో నటించిన ప్రకాష్ రాజ్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పని చేస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























