పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో పవన్‌ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్‌గా విలక్షణ నటుడు పార్థిబన్ ను పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘నల్ల నాగప్ప’ అనే పాత్రలో కనిపించనున్నారు. పొలిటీషియన్ గెటప్ లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్‌గా ఉన్న పార్తీబన్ లుక్ చూస్తుంటే, ఈసారి ఉస్తాద్‌కి గట్టి పోటీనే ఎదురయ్యేలా ఉందనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా వున్నాయి. మార్చి 26, 2026న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. విలన్ లుక్‌తో పాటు ఈ సినిమాలోని రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అప్డేట్ కూడా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ‘గబ్బర్ సింగ్’లో సిద్ధప్ప నాయుడు ఎంతగా పాపులర్ అయ్యారో, ఈ ‘నల్ల నాగప్ప’ క్యారెక్టర్ కూడా అంతకు మించి ఇంపాక్ట్ చూపిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
హరీష్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో శ్రీ లీల , రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























