యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 2026, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయనున్నామని ప్రముఖ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. ఈసినిమా ను తను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. అందుకు గాను 4.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్షన్ లో చెన్నై నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ గా తెరకెక్కిన ఈసినిమాలో యోగి బాబు కామెడీ ఒక ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది.: యూవీ కాన్సెప్ట్స్ నిర్మించగా ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ లభించింది, రన్ టైమ్ సుమారు 2 గంటల 1 నిమిషం.
ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా భారీగానేచేస్తున్నారు. ట్రైలర్ కూడా జనాలకు నచ్చడంతో సినిమాకు హైప్ పెరిగింది.మరి ఈసినిమాతో సంతోష్ శోభన్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























