మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తూ 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, కేవలం 8 రోజుల్లోనే ఈ భారీ మైలురాయిని చేరుకుని చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా అవతరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సెలవుల్లో మరియు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈసినిమా విడుదలైన ఏడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్’ సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది.ఇప్పటికే చాలా ఏరియాల్లో ఆల్ టైం రికార్డులు నెలకొల్పింది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలువనుంది.
అటు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సత్తా చాటుతుంది. నిన్నటి తో అక్కడ 4 మిలియన్ డాలర్ల మార్కును దాటి, చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఓవర్సీస్ చిత్రంగా నిలిచింది.సంక్రాంతి సెలవుల్లో ఊహించని విధంగా దుమ్ము రేపిన ఈసినిమా సెలవులు ముగిశాక కూడా అదే జోరు కొనసాగిస్తోంది. నిన్న ఈసినిమా దాదాపు 12కోట్ల గ్రాస్ రాబట్టి షాక్ ఇచ్చింది.ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో 350కోట్ల మార్క్ దాటనుంది.
ఇందులో నయనతార కథానాయికగా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశాడు. సాహు గారపాటి , సుస్మిత కొణిదెల ఈసినిమాను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ ఎనర్జీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం మరియు చిత్రంలోని కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేశాయి. ఈ సంక్రాంతి సీజన్లో వచ్చిన అన్ని సినిమాల్లోకెల్లా అత్యధిక వసూళ్లను రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది మన శంకరప్రసాద్ గారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























