చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారితో అలరించబోతున్నారు. జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. సామజవరగమన ఫేమ్ కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇక ఈసినిమా ట్రైలర్ హిలేరియస్ అనిపించింది. ట్రైలర్ ఫై సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆత్రేయపురంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శర్వా మాట్లాడుతూ.. హలో ఆత్రేయపురం. మీ అందరిని చూశాక ఈ సినిమాకి నారి నారి నడుమ మురారి.. మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ పెట్టాలనిపించింది. ఇది నాకు చాలా ఇష్టమైన ఊరు. శతమానం భవతి ఎక్కడే చేశాను. దాదాపు మూడు నెలలు ఇక్కడే ఉన్నాను. మీ అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. నేను మంచి సినిమాలు చేస్తానని నమ్మకం ఆడియన్స్ లో వుండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది మీ అందరిని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా. అన్నిట్లోకి అద్భుతమైనది నవ్వు. ప్రతి ఇంట్లో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అందరూ కూడా మా సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ. అది మీరందరూ మాకు ఇచ్చే కానుక. ఇది చాలా క్లీన్ ఫిలిం. మంచి కథని చాలా హ్యూమరస్ గా చెప్పడం జరిగింది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా టికెట్ ధరలని మేము పెంచడం లేదు. అందరికీ అందుబాటులో వున్న ధరలే వుంటాయి.అందరూ హ్యాపీగా వెళ్లి చూడండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























