మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. పాజిటివ్ రివ్యూస్ కు తోడు బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించి మెగాస్టార్ స్టామినాను మరోసారి నిరూపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అధికారిక సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.దాంతో సీనియర్ హీరోల చిత్రాలలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.అటు నార్త్ అమెరికాలో ఈసినిమా ఇప్పటివరకు 1.75 మిలియన్ డాలర్ల మార్కును దాటి ఈరోజుతో 2 మిలియన్ క్లబ్ లో చేరనుంది.
సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, డ్యాన్స్ మరియు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పండుగ సెలవులు కావడంతో , ఈ వారం ముగిసేసరికి ఈ చిత్రం సులభంగా 200 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























